ఇంటి గుమ్మాన్ని ఎందుకు పూజిస్తారు.. వాస్తుశాస్త్రం ఏం చెబుతుంది..

by Disha Web Desk 20 |
ఇంటి గుమ్మాన్ని ఎందుకు పూజిస్తారు.. వాస్తుశాస్త్రం ఏం చెబుతుంది..
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతం విభిన్న సంప్రదాయాలు, ఆచారాలకు నెలవు. పూజలు, వ్రతాలు, అనేక నియమాల గురించి పండితులు హిందూమతంలో ప్రస్తావించారు. అలాగే జ్యోతిషశాస్త్రంలో ఇంటి గడపను ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది. లక్ష్మీదేవి రూపమైన గడపను పూజించడం గురించి అనేక గ్రంథాలలో కూడా రచించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇంతకీ గడప మహాలక్ష్మి పూజ గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటిని నిర్మించేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా ప్రవేశాన్ని ఏర్పాటు చేయాలని వాస్తు, జ్యోతిషశాస్త్రంలో చెబుతున్నారు. గడప లేకుండా మెయిన్ డోర్ ఉండకూడదని గడప మహాలక్ష్మి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుందని చెబుతున్నారు. గడపను ఆరాధించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. అయితే గడపకు అసలు ఎందుకు పూజలు చేయాలి, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గడపను ఎందుకు పూజిస్తారు ?

వాస్తుశాస్త్రం ప్రకారం రాహువు ఇంటి గుమ్మంలో నివసిస్తాడట. అందుకే ద్వారాన్ని పూజించడం వల్ల రాహువు నుంచి కలిగే చెడు ప్రభావాలు తగ్గుతాయని, ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ద్వారాన్ని లక్ష్మీ దేవి ఆగమనానికి ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. అందుకే గడపకి పూజ చేయాలనే నిబంధన గ్రంథాలలో ఉంది. పసుపు, కుంకుమతో గడపను రోజూ పూజించాలని గ్రంధాలలో వివరించారు. ప్రతిరోజూ సాధ్యం కాకపోతే వారానికి ఒకసారి, ప్రతి పండుగ రోజున ద్వారాన్ని పూజించాలట.

ప్రతిరోజూ గుమ్మాన్ని శుభ్రపరిచి దానిపై నీళ్లు చల్లి, గుమ్మానికి పూజ చేయడం ద్వారా లక్ష్మీ దేవి ప్రసన్నురాలై ఇంటికి చేరుకుంటుందని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా ద్వార పూజ ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కలిగించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. పెళ్లయిన తర్వాత కొత్త వధువు ఇంటికి వచ్చినప్పుడు తనతో గుమ్మానికి పూజ చేయించడం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇంటి కోడలిని లక్ష్మిదేవి స్వరూపంగా భావిస్తారు. ఆమెతో గడప పూజ చేయడం ద్వారా ఇల్లు ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉంటుందని చెబుతున్నారు.

ప్రయోజనాలు..

ద్వార పూజ చేయడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. అలాగే అన్ని గ్రహాలు శాంతిస్తాయని, ఇంటిలోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

పూజ ఎలా చేయాలి?

మత విశ్వాసాల ప్రకారం ప్రతిరోజు గుమ్మాన్ని శుభ్రం చేసి, దాని పై గంగాజలం చల్లాలి. తర్వాత గుమ్మాన్ని పసుపు కుంకుమ, రంగోలి, పూలతో అలంకరించాలి. తర్వాత రోజు ఉదయం లేదా సాయంత్రం కుంకుమ పెట్టి దాని ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఇంటికి చేరుతుంది. దీనితో పాటు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుందని చెబుతారు.

Next Story

Most Viewed