నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by Disha Web Desk 6 |
నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల స్వామి వారిని రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వచ్చి దర్శించుకుంటారు. మొక్కిన మెక్కులు స్వామి వారికి చెల్లించి కుటుంబంమంతా తిరుపతిని సందర్శిస్తారు. అయితే నేడు తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. దీంతో వర్షం, పొగమంచుతో భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. శ్రీవారి పాదాల మార్గాలు మూసివేసినట్లు సమాచారం. తిరుమల రెండు ఘాటురోడ్లలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed