అరచేతిలో అలాంటి గుర్తులు ఉన్నాయా.. ఆ వయస్సు వారికి అదృష్టం మామూలుగా ఉండదట..

by Disha Web Desk 20 |
అరచేతిలో అలాంటి గుర్తులు ఉన్నాయా.. ఆ వయస్సు వారికి అదృష్టం మామూలుగా ఉండదట..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని చాలామంది వ్యక్తులకు జాతకాల పైన ఎంతో నమ్మకం ఉంటుంది. ఇందులో భాగంగానే చాలామంది హస్తసాముద్రిక శాస్త్రం అంటూ అరచేతుల పై ఉన్న గీతలు చూపించుకుని జాతకాలు చెప్పించుకుంటారు. అర చేతులపై ఉన్న గీతలు కూడా వారి విధి గురించి తెలియజేస్తాయని నమ్ముతారు.

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతి పై విజయానికి సంబంధించిన కొన్ని గీతలు ఉంటాయిని అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ రేఖలతో ఆర్థిక స్థితి బలపడటమే కాకుండా ప్రేమ జీవితం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. అయితే ఈ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి చేతిలో V (V) గుర్తు ఉంటే వారి జీవితంలో చాలా పురోగతిని పొందుతారట. మరి ఆ గుర్తు ఎక్కడ ఉండాలి జ్యోతిష్యపండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

అరచేతిలో V గుర్తు ఎక్కడ ఉండాలి ?

మీ అరచేతిలో V గుర్తు అరచేతి పై భాగంలో ఉంటుంది. అరచేతి పై ఈ గుర్తు ఉండటం వల్ల ఒక వ్యక్తి నిర్దిష్ట వయస్సు తర్వాత వారు విజయం సాధిస్తారని చెబుతున్నారు. అరచేతిలో ఈ గుర్తు ఉంటే ప్రస్తుతం వారి పని పూర్తి కావడం లేదని మీరు అర్థం చేసుకోవాలంటున్నారు.

35 ఏళ్ల తర్వాత అదృష్ట నక్షత్రం ప్రకాశిస్తుంది..

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం చూపుడు, మధ్య వేలు మధ్య V గుర్తును కలిగి ఉండటం శుభపరిణామంగా భావిస్తారు. అరచేతిలో V గుర్తు ఉన్నవారి అదృష్టం 35 ఏళ్ల తర్వాత ప్రకాశిస్తుందని చెబుతున్నారు. ప్రారంభంలో వారు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. కానీ క్రమంగా ఈ వ్యక్తులు తమ కష్టానికి రెట్టింపు ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు.

అలాంటి పురుషులు, మహిళలు అదృష్టవంతులు..

అరచేతిలో V గుర్తు ఉన్నవారిని చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తులు జీవితంలో అభివృద్ధి చెందడమే కాకుండా వారి జీవిత భాగస్వాముల పై ​​కూడా ప్రభావం ఉంటుందట. V గుర్తు ఉన్న స్త్రీ, పురుషుల వైవాహిక జీవితం కూడా ప్రేమతో నిండి ఉంటుందని చెబుతున్నారు. వీరికి జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుందని చెబుతున్నారు.

విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు...

అరచేతిలో V గుర్తు ఉన్న వ్యక్తులు చాలా డబ్బు సంపాదిస్తారని చెబుతున్నారు జ్యోతిష్యపండితులు. అలాంటి వారు కొన్ని పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు పొందుతారట. అక్కడ కూడా అలాంటి వారిని పెద్ద పదవులలో నియమిస్తారట. అలాగే వారు ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు. వ్యాపారంలో చాలా పురోగతి సాధించడంతో పాటు, అలాంటి వ్యక్తులు 30-35 సంవత్సరాలు వచ్చేసరికి జీవితంలో చాలా సంపాదిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని చెబుతున్నారు.

కష్టతరమైన సవాళ్లకు భయపడరు..

పామిస్టుల ప్రకారం అరచేతిలో V గుర్తు ఉన్న వ్యక్తులు క్లిష్ట పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. వారు సవాళ్లను అవకాశాలుగా తీసుకుని ముందుకు సాగుతుంటారట. అలాంటి వారి అదృష్టం 35 ఏళ్ల నుంచి పెరగడం మొదలై 40 ఏళ్లు వచ్చేసరికి వారి జీవితం రాజులా మారిపోతుందని చెబుతున్నారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Next Story

Most Viewed