నేడు శైవాలయాల్లో జ్వాలాతోరణం.. భక్తులు ఈ విధంగా చేస్తే కోటి జన్మల పుణ్యం

by Disha Web Desk 10 |
నేడు శైవాలయాల్లో జ్వాలాతోరణం.. భక్తులు ఈ విధంగా చేస్తే కోటి జన్మల పుణ్యం
X

దిశ,వెబ్ డెస్క్: ఇవాళ సాయంత్రం పౌర్ణమి. ఈ కార్తీక మాసంలో ఈ రోజు చాలా ప్రత్యేకం. ఈ రోజు శైవ ఆలయాల్లో సాయంత్రం వేళ జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొనాలని పండితులు సూచిస్తున్నారు. అసలీ జ్వాలాతోరణం ఏంటో, దీన్ని ఎందుకు జరుపుకుంటారో చూద్దాం..

పురాణాల ప్రకారం.. ఓసారి పరమేశ్వరుడు త్రిపురాసురులను చంపేందుకు వెళ్తాడు. కానీ ఎంతకీ తిరిగిరాడు. దాంతో ఆయన కోసం ఎదురు చూసీ చూసీ ఆవేదన చెందిన పార్వతీదేవి.. జ్వాలను ఏర్పాటు చేసి.. అందులో దూకాలని అనుకుంటుంది. సరిగ్గా ఆమె దూకే సమయంలో త్రిపురాసురుల్ని చంపేసి, శివుడు వస్తారు. దాంతో ఆమె అగ్నిలోకి దూకకుండా ఆగిపోతుంది. ఆమె రగిల్చిన అగ్నిని పరమేశ్వరుడు తోరణంలా చేస్తారు. తర్వాత పార్వతీ-పరమేశ్వరులు ఆ జ్వాలా తోరణంలో 3సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఇలా జ్వాలా తోరణం ప్రత్యేకమైనదిగా నిలిచింది. ఇవాళ శివుడి ఆలయాల్లో స్తంభాలకు గడ్డితో తోరణాలు ఏర్పాటు చేస్తారు. వాటికి నూనెలో ముంచిన వస్త్రాలను తగిలించి, వెలిగిస్తారు. ఎవరైతే భక్తులు జ్వాలాతోరణాన్ని దర్శించుకొని, దాని చూట్టూ 3సార్లు ప్రదక్షిణ చేస్తారో వారికి నరఘోష, దృష్టిదోషం, శత్రుబాధలు తొలగుతాయని పండితులు తెలిపారు.

Next Story

Most Viewed