వాస్తు ప్రకారం దీపావళి రోజు దీపాలను ఎలా? ఎక్కడ వెలిగించాలో తెలుసా?

by Disha Web Desk 9 |
వాస్తు ప్రకారం దీపావళి రోజు దీపాలను ఎలా? ఎక్కడ వెలిగించాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: దీపం మీ ఇంటి చీకట్లను తొలగించి వెలుతురు నింపుతుంది. అయితే దేశవ్యాప్తంగా జరుపుకునే దీపావళికి వాస్తు శాస్త్రంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా దీపం సరైన ప్లేస్‌లో వెలిగించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అప్పుడే ఆ దీపం మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. కాగా దీపావళి పండుగ సందర్భంగా.. నరక చతుర్దశి రోజు దీపాలను వెలిగించాలని శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, దీపావళి రోజున దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే లక్ష్మీ దేవి ఆశీస్సులు ఏడాది పొడవునా ఉంటాయని నమ్ముతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం దీపాలు ఎక్కడ, ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం:

దీపావళి నాడు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో సుఖ, సంతోషాలు లభిస్తాయి. ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. దీపావళి రోజున ఆవ నూనెతో దీపం వెలిగించడం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎంతో మేలు జరుగుతుంది. నూనె ఇంటి శక్తిని నిర్ణయిస్తుంది. దీపం వత్తి ఆత్మకు చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం దీపం వెలిగించే పళ్లెంలో బంగారు లేదా వెండి ఆభరణాలను ఉంచాలి. దీని ద్వారా లక్ష్మీమాత అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంటి దగ్గర్లో గుడి ఉంటే ముందుగా అక్కడికి వెళ్లి దీపం వెలిగించాలి. తర్వాత ఇంట్లోని పూజ గదిలో, ఇతర ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి.

దీపావళి రోజున గుడిలో దీపం వెలిగించిన తర్వాత ముందుగా ఇంటి ముందు దీపం వెలిగించాలి. ఒకవేళ పూజ ఈశాన్య దిశలో ఉంటే అక్కడ దీపం ముట్టించడం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది. దక్షిణం వైపుగా దీపం పొరపాటున కూడా వెలిగించకూడదు. అలా చేయడం ద్వారా అశుభంగా భావిస్తారు. తూర్పు వైపు దీపం ముట్టించాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.



Next Story

Most Viewed