కేతకి అనే అప్సరస మొగలి వనంగా మారింది ఈ క్షేత్రంలోనే..

by Disha Web Desk 20 |
కేతకి అనే అప్సరస మొగలి వనంగా మారింది ఈ క్షేత్రంలోనే..
X

దిశ, ఫీచర్స్ : మన భారతదేశంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయాలనికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే కొన్ని ఆలయాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. అలాంటి ఒక ఆలయాల్లో ఒక ఆలయమే శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం. సంగారెడ్డిలో వెలసిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని 'దక్షిణ కాశీ' అని కూడా అంటారు. కేతకి సంగమేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని ఝరాసంగం గ్రామంలో ఉంది. మంజీర నదీతీరంలో వెలసి పురాతన శైవక్షేత్రంగా, దక్షిణ కాశీగా పిలుస్తున్న ఈ దేవాలయంలోని శివుడికి మొదట బ్రహ్మదేవుడు కేతకీ (మొగలి) పుష్పాలతో పూజించాడు.

ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పౌరానిక కథలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. పూర్వం ఈ రాజ్యాన్ని పాలించే సూర్య వంశానికి చెందిన కుపేంద్ర రాజు కలలో శివుడు కనిపించాడని, ఆ తర్వాత ఆయన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. అలాగే బ్రహ్మదేవుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడని హిందూ పురాణం చెప్పింది. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలయ చరిత్ర..

పూర్వం కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతకీ వనం (మొగలి వనం)గా మారింది. ఆ కేతకీ వనంలో బ్రహ్మ కూర్చొని శివుని గురించి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడట. అలా ఈ క్షేత్రానికి కేతకీ సంగమేశ్వర క్షేత్రమని పేరు వచ్చిందని స్కంద పురాణంలో చెప్పారు.

కృతయుగంలో సూర్యవంశానికి చెందిన రాజా కుపేంద్ర చర్మవ్యాధితో బాధపడేవాడట. ఎంతమంది వైద్యులు వచ్చినా అతనికి చికిత్స చేయలేకపోయారట. ఒకరోజు ఆ రాజు హఠాత్తుగా కేతకీ వనానికి చేరుకున్నాడట. అక్కడ ఒక పుష్కరిణిని చూసి అందులో ఆయన స్నానం చేశాడట. దీంతో వెంటనే వైద్యులెవరూ నయం చేయలేని చర్మవ్యాధి పూర్తిగా నయమైందని పురాణాలు చెబుతున్నాయి. అదే రోజు రాత్రి కుపేంద్ర రాజు కూడా తన కలలో శివుడిని చూశాడని చెప్పారట.

శివుడు కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడు. ఈ దేవాలయానికి వెనుక భాగంలో పెద్ద గుండం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. కాశీలో ప్రవహించే గంగా నది ఝరా (జలం) భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేసి, స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో పాటు ఆ రంధ్రం నుండి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత మళ్ళీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది. అలాగే ఇక్కడి ఉన్న గుండంలో 8 తీర్థాలు అంటే (నారాయణ, ధర్మ ఋషి, వరుణ్, సోమ, రుద్ర, ఇంద్ర, డేటా) ఉన్నందుకు దీనిని 'అష్ట తీర్థ అమృత గుండం' అని కూడా అంటారు.

బ్రహ్మ శివలింగాన్ని స్థాపించాడు

హిందూ పురాణాల ప్రకారం విశ్వం ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ధ్యానం చేసేందుకు ఇక్కడికి వచ్చాడని చెబుతారు. ఇప్పుడున్న శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కేతకి పుష్పాలతో పూజలు చేస్తారు.

13వ శతాబ్దపు దేవాలయం

సంగారెడ్డిలో అనేక ఇతర చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. అందులో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయం ఒకటి. ఇది 13వ శతాబ్దంలో నిర్మించారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయాన్ని రెండవ శ్రీశైలం అని కూడా అంటారు. ఈ దేవాలయం పటాన్చెరు మండలంలో ఉంది. శివరాత్రి సమయంలో ఇక్కడ ఐదు రోజుల పండుగ జరుపుకుంటారు.

Read More..

మహాశివ రాత్రికి ఒక రోజు ముందే శుక్ర-బుధ గ్రహాల కదలికలు.. ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం



Next Story

Most Viewed