నవరాత్రికి ముందు రోజే సూర్యగ్రహణం.. ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా..

by Disha Web Desk 20 |
నవరాత్రికి ముందు రోజే సూర్యగ్రహణం.. ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. అలాగే ఈ ఏడాది కూడా హోలీ రోజున మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోవడంతో గ్రహణ నియమాలు పాటించలేదు. అలాగే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం కొద్ది రోజుల్లోనే ఏర్పడబోతోంది. చైత్ర నవరాత్రులకు ముందు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రపరంగా, మతపరంగా, గ్రహణాన్ని ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అంతే కాదు గ్రహణాలను, ఏర్పడే సమయాలను అశుభకరంగా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఎప్పుడుంది, అది ఏ దేశంలో కనిపిస్తుంది అన్న విషయాలు చాలామందికి తెలిసి ఉండదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ 2024 సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది ?

ఈ ఏడాది ఏప్రిల్ 8, 9 తేదీల మధ్య రాత్రి మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఏప్రిల్ 8వ తేది రాత్రి 9:12 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం మధ్యాహ్నం 2:22 గంటల వరకు కనిపిస్తుంది. సూతకాలం గ్రహణం ఏర్పడే 12 గంటల ముందు మొదలవుతుంది. ఈ ఏడాది వచ్చిన చంద్రగ్రహణం లాగే సూర్యగ్రహణం కూడా భారత్ లో కనిపించదు. అందుకే ఇక్కడ గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు.

ఏప్రిల్‌లో సూర్యగ్రహణం ఏ దేవాల్లో కనిపిస్తుంది ?

క్యూబా, డొమినికా, కొలంబియా, కోస్టారికా, అరుబా, బెర్ముడా, రష్యా, ప్యూర్టో రికో, కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, గ్రీన్‌లాండ్, ఐర్లాండ్, పనామా, నికరాగ్వా, కరేబియన్ నెదర్లాండ్స్, ఐస్‌లాండ్, నార్వే, జమైకా, సెయింట్ మార్టిన్ స్పెయిన్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో 2024లో వచ్చే మొదటి సూర్యగ్రహణం కనిపిస్తుందని చెబుతున్నారు.

Next Story

Most Viewed