సాయంత్రం పూట శివలింగానికి అభిషేకం చేయొచ్చా.. శివుడిని ఎలా పూజించాలి..

by Disha Web Desk 20 |
సాయంత్రం పూట శివలింగానికి అభిషేకం చేయొచ్చా..   శివుడిని ఎలా పూజించాలి..
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో, భక్తులందరూ ప్రతి సోమవారం శంకరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. సోమవారం దేశంలోని అన్ని శివాలయాల్లో పూజలు చేస్తూ ఉంటారు. శివునికి ప్రత్యేక అభిషేకాన్ని నీరు, పాలతో చేస్తారు. అయితే సాయంత్రం పూట శివలింగానికి నైవేద్యాన్ని సమర్పిస్తే ఏమవుతుంది.. అలా చేస్తే శుభమో, అశుభమో అని సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. సాయంత్రం పూట శివుడిని పూజించేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి, శివలింగానికి అభిషేకం చేయవచ్చా లేదా అనే సందేహాలను ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాం.

పురాణాల ప్రకారం శివుడిని పూజించే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ పూజకు పూర్తి ఫలితాలు లభించవు. ప్రతి సోమవారం మహాదేవుని పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. శివపురాణం ప్రకారం శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ తప్పు దిశలో నిలబడకూడదని పండితులు చెబుతున్నారు. శివలింగానికి దక్షిణం, తూర్పు ముఖంగా ఉండి నీరు సమర్పించడం అశుభం అని చెబుతున్నారు. శివ భక్తులు ఉత్తరాభిముఖంగా నిలుచుని శివలింగానికి ఎల్లప్పుడూ అభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పార్వతి మాత నివసించే భోలేనాథుని ఎడమ వైపు ఉత్తర దిశ అని పౌరాణికంగా నమ్ముతారు.

శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు హాయిగా కూర్చుని మంత్రాలు జపిస్తూ నీటిని సమర్పించాలి. నిలబడి నీళ్లను సమర్పిస్తే ఫలితం ఉండదని చెబుతున్నారు పండితులు. అందుకే శివలింగానికి రాగి పాత్రలో నీరు సమర్పించడం మంచిదని భావిస్తారు. ఇనుము ఉపయోగించిన పాత్రల నుండి శివలింగానికి నీటిని ఎప్పుడూ సమర్పించవద్దని చెబుతారు. రాగి పాత్ర పూజకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

సాయంత్రం నీటిని అందించవద్దు..

శివ పురాణం ప్రకారం సాయంత్రం పూట భోలేనాథునికి అభిషేకం చేయవద్దని చెబుతున్నారు. ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య శివలింగం పై నీరు పోయడం శుభప్రదంగా భావిస్తున్నారు. మీరు శివునికి జలాభిషేకం చేసినప్పుడల్లా, నీటిలో ఇతర పదార్థాలను కలపవద్దు. ఇలా చేయడం వల్ల భక్తులకు పూర్తి ఫలితాలు అందడం లేదు.

శంఖంతో నీటిని ఎప్పుడు సమర్పించవద్దు..

పురాణాల ప్రకారం శివుడు ఒకసారి శంఖచూడ అనే రాక్షసుడిని చంపాడు. అదే రాక్షసుడి ఎముకలతో శంఖం తయారు చేశారు. అంతే కాకుండా శివలింగం పై నీటిని సమర్పించేటప్పుడు, నీటి ప్రవాహం ఆగిపోకూడదని చెబుతుంటారు. ఒకసారి జలాభిషేకం చేయడం మంచిది. ఎందుకంటే జలాభిషేకం సమయంలో నీటి ప్రవాహం ఆగిపోతే భక్తులు ఈ పూజ ఫలితాలను పొందలేరు.



Next Story