లక్ష్మీ పూజలో ఐదు వత్తులతో దీపారాధన.. దాని వెనకున్న అంతరార్థం, విశిష్టత ఏంటో తెలుసా..?

by Disha Web Desk 7 |
లక్ష్మీ పూజలో ఐదు వత్తులతో దీపారాధన.. దాని వెనకున్న అంతరార్థం, విశిష్టత ఏంటో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూసాంప్రదాయం ప్రకారం దీపారాదనకు చాలా విశిష్టత ఉంది. దీపం అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంతే కాదు దీపంలో సకల దేవతలు, వేదాలు కొలువై ఉంటాయని వేదాలు చెబుతున్నాయి. అయితే చాలా మంది దీపం ఎలా పెట్టాలి.. ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే మంచిది అనే సందేహంలో ఉంటారు. పండితులు తెలిపిన దాని ప్రకారం దీపం ఎలా వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

దీపంలో రెండు లేదా ఐదు వత్తులు వేసి వెలిగించాలి. రెండు వత్తులతో దీపం పెట్టినట్లయితే.. రెండు అంటే జంట అని అర్థం. హిందు పురాణాల్లో జంటకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి రెండు వత్తులతో దీపం వెలిగిస్తే భార్యాభర్తలకు మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే ఐదు వత్తులతో దీపం వెలిగించినట్లయితే.. ఈ ఐదు వత్తుల్లో ఒక్కో వత్తుకి ఒక్కో ప్రాధాన్యం ఉంది. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసం. రెండో వత్తి అత్తమామల క్షేమం కోసం. మూడొవ వత్తి తోడబుట్టిన వాళ్లు క్షేమం కోసం. నాల్గవ వత్తి ఇంటి గౌరవం, ఐశ్వర్యం, ధర్మం కోసం.. ఇక ఫైనల్‌గా ఐదొవ వత్తి వంశాభివృద్ధి కోసం సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలా దీపపు కుందిలో ఐదు వత్తులు వేసి ఇంటి ఇల్లాలు దీపం వెలిగించినట్లుయితే ఆ ఇళ్లు ఆయురారోగ్యాలతో సకల సంపదలతో వర్ధిల్లుతుందని పురాణాలు చెబుతున్నాయి. కానీ, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఒక్క వత్తితో దీపం వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు.



Next Story

Most Viewed