సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా దేవినేని ఫైర్

by  |
సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా దేవినేని ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ నేత దేవినేని ఉమా సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. టమాట రైతులకు మద్దతు ధర, అమ్మ ఒడి పథకంలో ఆంక్షలు, కార్స్ సాఫ్ట్ వేర్ ఇలా వివిధ అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మఒడి పథకం ఇవ్వాలంటే ప్రభుత్వం సవాలక్ష షరతులు పెడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ఆదివారం ఆయన ట్విట్టర్​లో దీనిపై స్పందిస్తూ తెల్లరేషన్ కార్డు లింకుతో ఎనిమిది లక్షల మంది దూరమైనట్లు తెలిపారు. వయసు, ఆధార్ అంటూ ప్రభుత్వం భారీగా కోతలు పెడుతోందని విమర్శించారు. లక్షలాది మంది తల్లులకు అమ్మఒడి దూరం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల ముందు అందరికీ అమ్మఒడి అని చెప్పి నేడు ఆంక్షల సుడిలోని నెట్టి నిలువునా మోసం చేశారని దేవినేని ఉమ ఆరోపించారు.

‘మార్కెట్ లో కిలోటమాట రూ.20 ఉంటే రైతుకుదక్కేది మాత్రం ఒక్క రూపాయా? పెట్టుబడి మాట దేవుడెరుగు రవాణాఖర్చులు కూడా రావంటున్న రైతులు, దళారులదోపిడీకి గురవుతున్న టమాటా రైతులు. ఎన్నికల ముందు చెప్పిన ధరల స్థిరీకరణనిధి, మద్దతు ధరల మాటలు ఏమయ్యాయి? అంటున్న రైతులకు సమాధానం చెప్పండి’ అంటూ ప్రశ్నించారు.

‘రీసర్వే పేరుతో కార్స్ సాఫ్ట్ వేర్ కోసం కోట్లు ఖర్చుచేశారు, స్కెచ్ ను సరిగా విడుదల చేయడంలేదన్న విషయం ఎందుకు బయటపెట్టలేదు? కొనుగోలు బండారం బయటపడుతుందనా? ప్రజల వ్యక్తిగత ఆస్తులపై మీబొమ్మలు ఎలా వేసుకుంటారు? గతంలో లేనివి,కొత్తగా మీరు కల్పించే హక్కుఏమిటి? సర్వే వెనకున్న అసలు మతలబు ఏమిటి? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.


Next Story