స్టేషన్‌లో బోర్డుపై బయోడేటా.. 3 గంటల్లో వరించిన ఉద్యోగం!

by  |
haider malik
X

దిశ, ఫీచర్స్ : 24 ఏళ్ల హైదర్ మాలిక్ లండన్‌లోని మిడిల్‌సెక్స్ యూనివర్సిటీ నుంచి బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో ఫస్ట్-క్లాస్ డిగ్రీ పొందాడు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న తను.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు కూడా అటెంప్ట్ చేసినా కానీ జాబ్ రాలేదు. ఇలాంటి తరుణంలోనూ ఏ మాత్రం విసుగు చెందని మాలిక్, ఓ కొత్త ఆలోచనతో మూడు గంటల్లోనే జాబ్ సంపాదించాడు. అదెలానో తెలుసుకోండి..

మాలిక్.. ఒక వైట్ బోర్డు మీద పేరు, విద్యార్హత, జాబ్ రోల్ సహా తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్, సీవీకి క్యూఆర్స్ కూడా జతచేశాడు. దీని ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటు అపరిచిత వ్యక్తులతో స్నేహం కుదుర్చుకోవాలన్నది అతని ఉద్దేశ్యం. వారి వద్ద ఉద్యోగావకాశాల గురించి ఆరా తీసి, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. బ్యాగ్‌లో CV కాపీలు కూడా సిద్ధంగా పెట్టుకున్నాడు. కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ ఎదురుపడ్డ వారిని చూసి నవ్వుతూ.. ‘గుడ్ మార్నింగ్’ అంటూ విష్ చేస్తూ మాటలు కలిపేవాడు.

ఈ క్రమంలోనే కలిసిన ఇమ్మాన్యుయేల్ అనే వ్యక్తి మాలిక్ చిత్రాన్ని తీసి లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ట్రెజరీ అనలిస్ట్ రోల్ కోసం ఇంటర్వ్యూకు రావాల్సిందిగా ‘కానరీ వార్ఫ్ గ్రూప్’ నుంచి అతనికి సందేశం వచ్చింది. తొలి రౌండ్ క్లియర్ చేసిన మాలిక్, ఆ తర్వాత ఇంటర్య్వూ క్లియర్ చేసి ఉద్యోగం పొందాడు.

‘ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. నాకు కూడా విచిత్రంగా అనిపించింది. స్టేషన్‌లో అలా నిలబడటం ఇబ్బందికరంగా భావించాను. కానీ చాలామందితో కనెక్ట్ అయ్యాను. ఎంతోమంది తమ కార్డ్స్ ఇచ్చారు, కొందరు ఫోన్ నెంబర్లు ఇచ్చారు. కానీ ఇమ్మాన్యుయేల్ మాత్రం నా ఫేట్ మార్చేశాడు. ఇదంతా భిన్నమైన స్టోరీ కావచ్చు. కానీ ఒక అవకాశం తీసుకున్నాను, అది ఫలించింది. నిజంగా ఇది అద్భుతమే’ అని హైదర్ మాలిక్ తెలిపాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story