సిఐ వేధింపులు : డిప్యూటీ సీఎం వార్నింగ్ 

by  |
సిఐ వేధింపులు : డిప్యూటీ సీఎం వార్నింగ్ 
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మలమడుగు ఎక్సైజ్ సీఐ వేధింపులపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ మహిళా ఎస్‍ఐను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. త్వరగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించిన డిప్యూటీ సీఎం… నేరం రుజువైతే చర్యలు తీసుకుంటామని సీఐని ఉద్దేశించి హెచ్చరించారు.

కాగా జమ్మలమడుగు ప్రొహిబిషన్ మరియు ఎక్స్ జ్ శాఖ పోలీస్ స్టేషన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న చెన్నారెడ్డి.. వేధింపులకు గురి చేస్తున్నారంటూ మహిళా ఎస్సై చంద్రమణి ఆరోపించారు. సిఐ అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం ఒక మహిళా ఎస్సైకి ఇవ్వాల్సిన కనీస విలువలు ఇవ్వడం లేదని, ఆయన వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.

ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ చంద్రమణి శనివారం మీడియా ముందుకు వచ్చారు (వీడియో కింద ఉంది చూడవచ్చు). దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి విచారణకు ఆదేశాలిచ్చారు.

Next Story

Most Viewed

    null