ఎరువుల ధరలు తగ్గాయి: సదానందగౌడ

by  |
ఎరువుల ధరలు తగ్గాయి: సదానందగౌడ
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు సరసమైన ధరలకు ఎరువులను అందించడానికి ఫెర్టిలైజర్స్ శాఖ కృషి కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డి.వి సదానంద గౌడ అన్నారు. దేశంలో ఎరువుల ఉత్పత్తి, దిగుమతుల వ్యయంపై రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫెర్టిలైజర్స్ డిపార్ట్‌మెంట్ మదింపు చేస్తోందని.. దీంతో ఎరువుల కంపెనీలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ విధానాన్ని పాటిస్తున్నాయని మంత్రి అన్నారు.

ప్రపంచ మార్కెట్‌లో రీగాసిఫైడ్ లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ – ఆర్ఎల్ఎన్‌జీ ధరలు భారీగా తగ్గాయని.. దీంతో మిగిలే లాభాన్ని సంస్థలు రైతులకు ధర తగ్గింపు రూపంలో అందిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. 2019 ఆగస్టులో మెట్రిక్ టన్ను డీఏపీ ధర రూ.26,396 ఉండగా.. 2020 ఆగస్టులో రూ.24,626కు తగ్గిందన్నారు. ఎంటీ అమ్మోనియం సల్ఫేట్ ధర 2019 ఆగస్టులో రూ.13,213 ఉండగా.. ప్రస్తుతం రూ.13149 గా ఉందని మంత్రి వెల్లడించారు.

Next Story

Most Viewed