వేద విశ్వ విద్యాలయాన్ని సెంట్రల్​వర్శిటీగా ప్రకటించండి

by  |
వేద విశ్వ విద్యాలయాన్ని సెంట్రల్​వర్శిటీగా ప్రకటించండి
X

దిశ, ఏపీ బ్యూరో : టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయాన్ని సెంట్రల్​వర్శిటీగా ప్రకటించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ కు విన్నవించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. 2006లో వేద విద్యావ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 2007లో యూజీసీ దీన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయం గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ వర్శిటీ వేదాల్లో డిగ్రీ నుంచి పీహెచ్​డీ దాకా అనేక కోర్సులు నడుపుతోందన్నారు. 14 సంవత్సరాలుగా వేద విశ్వవిద్యాలయానికి యూజీసీ 2ఎఫ్ గుర్తింపు ఇచ్చినట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు 12బీ కేటగిరీ గుర్తింపు ఇవ్వాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు విద్యాసంస్థలకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల హోదా ఇచ్చింది. ఎస్వీ వేద విశ్వవిద్యాలయానికీ జాతీయ వేద విశ్వ విద్యాలయం హోదా ప్రకటించాలని విన్నవించారు. ఢిల్లీలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర కళాశాలలో తెలుగు, తమిళం, సంస్కృతం విభాగాల్లోని సీట్లలో టీటీడీ కోటాను పునరుద్ధరించాలని సుబ్బారెడ్డి మంత్రికి మరో వినతి పత్రం సమర్పించారు. 2016 ముందు వరకు అమలైన ఈ కోటాను తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ అనుమతించడం లేదన్నారు. 1961 లో ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేసిన ఈ కళాశాలను ఢిల్లీలో ని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటిగా టీటీడీ తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.



Next Story

Most Viewed