హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి :కేంద్ర మాజీ మంత్రి

by  |
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి :కేంద్ర మాజీ మంత్రి
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘దేశంలో కొవిడ్-19 రికవరీల కన్నా ఇన్‌ఫెక్షన్లు వేగంగా ఉన్నాయి. అందువల్ల నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించండి’ అని అందులో కోరారు. అంతేగాక ఎన్నికల ర్యాలీలపై మారటోరియం డిక్లేర్ చేయాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. ఇక వారణాసిలో కొవిడ్ పరిస్థితిపై మోడీ సమీక్షించిన అనంతరం కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఆయనపై సెటైర్లు వేశారు. ఇంతటి యుద్ధ సమయంలోనూ కొంత సమయం కేటాయించారని ఎద్దేవా చేశారు. బెంగాల్‌ను ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఉద్దేశాన్ని ఆయన సెటైరికల్ గా పేర్కొంటూ చిదంబరం ఈ ట్వీట్ చేశారు. ‘ఇంతటి యుద్ధ సమయంలోనూ కరోనా పరిస్థితిపై సమీక్షించినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.



Next Story