సీఎం సర్… దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా..?

by  |
సీఎం సర్… దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా..?
X

దిశ, ముధోల్: ‘అయ్యా సీఎం కేసీఆర్ దళితులు అంటే ఎందుకంత చిన్నచూపు.. కేవలం రాజకీయాల కోసమే పథకాలు ప్రవేశపెడుతున్నారు’ అంటూ నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం హుజురాబాద్ పరిధిలోని దళితులకు మాత్రం దళితబంధు అమలు చేయడం ఎంతవరకు సమంజసం అని, ఈ దళిత బంధుని రాష్ట్రం మొత్తంలో అమలు చేయాలని అన్నారు.

ముధోల్ నియోజకవర్గంలోని తెరాస ఎమ్మెల్యే రాజీనామా చేయాలని దీంతో జరిగే ఉప ఎన్నికలలో దళితులందరికీ దళిత బంధు ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. తరచూ ముంపుకు గురి అవుతున్నా.. ఇప్పటివరకు బైంసా మండలంలోని గుండెగాం గ్రామానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయలేదని అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్స్ ఇప్పటికి తాలూకాలో ఎవ్వరికీ అందింది లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన నుండి రాష్ట్ర రాజకీయాలలో నిజమైన ప్రశ్నించే నాయకత్వం బలపడింది తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed