- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీ20 వరల్డ్ కప్‌లో వార్నరే ఓపెనర్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ మాత్రమే కాకుండా జట్టులో స్థానం కూడా కోల్పోయిన డేవిడ్ వార్నర్‌పై ఆస్ట్రేలియా జట్టు మాత్రం నమ్మకం పెట్టుకున్నది. యూఏఈ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో ఆరోన్ ఫించ్‌తో కలసి డేవిడ్ వార్నర్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్వయంగా తెలిపాడు. ‘ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ ఒక అద్భుతమైన ఆటగాడు. వరల్డ్ కప్ కోసం అతడు తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున అతడు విఫలం అయిన సంగతి తెలుసు. కానీ, వార్నర్ ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు’ అని ఫించ్ అన్నాడు. ప్రస్తుతం జట్టు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నదని ఫించ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ అక్టోబర్ 23న సౌతాఫ్రికాతో ఆడనున్నది.
Advertisement
Next Story