సుమారు వంద మంది చనిపోయారు : శ్రావణ్

2

దిశ, వెబ్‌డెస్క్ :  తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే. అకాల వర్షాల వలన సంభవించిన నష్టంపై తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

రాజేంద్రనగర్ మండలంలోని హైదరాబాద్- బెంగళూరు రహదారి సమీపంలో ఉన్న గగన్ పహాడ్ వద్ద చెరువు ప్రవహానికి కొట్టుకుని పోయి సుమారు 100 మంది చనిపోయారని ట్వీట్ చేశారు. ఆ సమయంలో వచ్చిన భారీ వరద ప్రవాహానికి 70 కార్లు సైతం కొట్టుకుపోయాయని చెప్పారు. అయితే, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎవరికీ చెప్పకుండా దాస్తోందని ఆరోపించారు.