ప్రమాదకరంగా మారిన మూలమలుపు.. పట్టించుకోని అధికారులు

by  |
ప్రమాదకరంగా మారిన మూలమలుపు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, తిరుమలాయపాలెం: మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిని అనుసంధానం చేస్తూ.. 2017లో అప్పటి రోడ్డు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హయాంలో.. రూ.660 లక్షలతో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం పూర్తిగా దెబ్బతింది. ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ వెళ్లేందుకు ఈ రోడ్డునే ప్రయాణికులు ఎంచుకుంటారు. దీనికి తోడు స్థానిక ప్రయాణికులకు ఇది షార్ట్‌ కట్. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో ప్రధాన రహదారి కాస్తా పాడైపోయింది.

ఖమ్మం రూరల్‌ పరిధి చింతపల్లి, సీతారాంపురం, కొండాపురం, అరేంపల వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల వ్యాపారులు లోడు లారీలతో ఇదే దారిని ట్రాన్స్‌పోర్టుకు ఎంచుకున్నారు. దీంతో భారీ వాహనాలు ఫుల్ లోడుతో తిరుమలాయపాలెం మీదుగా నిత్యం రాకపోకలు చేస్తుండడంతో రోడ్డు దెబ్బతింటోంది. ఇప్పటికే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి టర్నింగ్ దగ్గర 40 అడుగుల పొడవు, మూడు అడుగుల లోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది.

దీంతో మూల మలుపు వద్ద బైకర్లు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా అధికారులు చూసిచూడనట్టు వదిలేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కనీసం అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed