యాస్ తుఫాన్ అలర్ట్.. రంగంలోకి NDRF

by  |
యాస్ తుఫాన్ అలర్ట్.. రంగంలోకి NDRF
X

దిశ, వెబ్‌డెస్క్ : యాస్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో బెంగాల్, ఒడిషా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బెంగాల్‌లోని దిఘా తీరానికి 670 కి.మీ దూరంలో యాస్ తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈరోజు రాత్రికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఎల్లుండి ఒడిషాలోని పారాదీప్, బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య యాస్ తీరం దాటే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో NDRF సిబ్బంది సహాయక చర్యలకు సన్నద్ధమయ్యారు. సహాయక చర్యల కోసం NDRF 46 బృందాలను ఏర్పాటుచేసింది. వీరంతా సముద్ర తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దక్షిణ 24 పరగణ, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. సహాయక చర్యలపై వారితో చర్చించారు.



Next Story

Most Viewed