యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులతో మోడీ భేటీ

by  |
యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులతో మోడీ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : యాస్ తుఫాను ముప్పు నేపథ్యంలో తూర్పు తీర రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ విపత్తు నిర్వాహక నిపుణులు, వైమానిక దళానికి చెందిన అధికారులు హాజరు అయ్యారు. తీర ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా మోడీ.. వైమానిక దళ అధికారులను ఆదేశించారు. అయితే, ఈ నెల 26న ఒడిశా, బెంగాల్ మధ్య యాస్ తుఫాన్ తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపట్టాయి.

Next Story

Most Viewed