కీసర తహసీల్దార్ కేసులో నిందితులకు ముగిసిన కస్టడీ

by  |
కీసర తహసీల్దార్ కేసులో నిందితులకు ముగిసిన కస్టడీ
X

దిశ, వెబ్‌డెస్క్: రూ.కోటి 10లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో నలుగురు నిందితులకు కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో వేర్వేరుగా విచారించారు. ప్రతిరోజు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ ఆఫీస్‌కు తీసుకువచ్చి విచారణ అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. రూ. కోటి 10లక్షల లంచంపై శ్రీనాథ్, అంజిరెడ్డి ఏసీబీ అధికారులకు వివరణ ఇచ్చారు. నలుగురు నిందితులు బెయిల్‌ పిటిషన్ దాఖలు చేయగా… శుక్రవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed