రహదారి భద్రతపై ప్రతి జిల్లాకు కార్యాచరణ: సీఎస్

by  |
రహదారి భద్రతపై ప్రతి జిల్లాకు కార్యాచరణ: సీఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రహదారి భద్రతపై ప్రతి జిల్లాకు కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రతపై ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడం, గోల్డెన్‌ అవర్స్‌లో వైద్య సేవలకు అంబులెన్స్‌‌లు , ఆసుపత్రులు, ట్రామా కేర్‌ సెంటర్ల ద్వారా వైద్యసేవలు అందించే నిమిత్తం రూపొందించిన యూనిఫైడ్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సమీక్షించారు. ట్రామా కేర్‌ సెంటర్లలో పనిచేస్తున్న హెల్త్‌ వర్కర్లకు నిమ్స్‌ ఎమెర్జెన్సీ మెడిసిన్‌ ద్వారా శిక్షణను అందించాలన్నారు. ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు త‌గ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువ‌గా జ‌రిగే ప్రాంతాల్లో ఏఎన్‌పీఆర్ కెమెరాల ద్వారా వేగ నియంత్రణ, పర్యవేక్షణతోపాటు త‌దిత‌ర అంశాల‌ను అధ్యయనం చేసేందుకు ఓ క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. సుర‌క్షిత డ్రైవింగ్‌పై ప్రభుత్వ డ్రైవర్లకు ఒక‌రోజు శిక్షణ ఇవ్వాలని, ఇందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారులను సోమేశ్ కుమార్ ఆదేశించారు.


Next Story

Most Viewed