9.5 శాతానికి వృద్ధి అంచనాను తగ్గించిన క్రిసిల్..

by  |
9.5 శాతానికి వృద్ధి అంచనాను తగ్గించిన క్రిసిల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 9.5 శతానికి కుదిస్తున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సంస్థ సోమవారం ప్రకటించింది. గతంలో క్రిసిల్ దేశ వృద్ధి అంచనాను 11 శాతంగా అంచనా వేసింది. సెకెండ్ వేవ్ కారణంగా ప్రైవేట్ వినియోగం, పెట్టుబడుల క్షీణత వంటి వృద్ధికి కీలకమైన అంశాల ప్రతికులత కారణంగా వృద్ధి అంచనాను సవరించినట్టు సంస్థ తెలిపింది. సెకెండ్ వేవ్ వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత తీవ్రంగా భారత ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్నదని, చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా వినియోగదారుల, వ్యాపార విశ్వాసం క్షీణించిందని క్రిసిల్ నివేదిక అభిప్రాయపడింది.

“ఈ ఏడాది ఆగష్టు వరకు కరోనా ప్రభావిత ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. ఇవి ప్రత్యక్ష లాక్‌డౌన్ కాకపోయినా ఏదొక రూపంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. దేశంలోని అందరికీ కరోనా టీకా అందించడం ద్వారా ఆర్థిక పునరుద్ధరణ కీలకం. రాబోయే నెలల్లో టీకా ఎంత వేగవంతంగా జరిగితే ఆర్థిక పునరుజ్జీవనం అంత వేగంగా ఉండనుందని” క్రిసిల్ ఆర్థికవేత్తలు వివరించారు. ఇటీవల భారత్‌లో మూడో వేవ్ మరింత తీవ్రంగా ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తుందని వైద్య శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, అప్పటి పరిస్థితులను ఊహించడం కష్టమని, మూడో వేవ్ ప్రభావం వృద్ధి అంచనాపై ఉంటుంది. టీకా పురోగతి, ప్రభావ తీవ్రతను బట్టి జీడీపీ వృద్ధి అంచనా 8 శాతానికి ఉండే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. కాగా, గతవారం ఆర్‌బీఐ తన విధాన సమీక్షలో భారత జీడీపీ వృద్ధి అంచనాను 9.5 శాతానికే సవరించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed