ఎన్నికల వేళ భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

by Disha Web Desk 2 |
ఎన్నికల వేళ భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత
X

దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని కూనవరం చెక్‌పోస్ట్ వద్ద ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని ప్రత్యేకంగా తనిఖీ చేశారు. దీంతో ఆ వాహనంలో దాదాపు రూ. 5,25000 విలువ జేసే 21 కేజీల గంజాయి లభ్యమైంది. ఆ గంజాయిని సీజ్ చేసి.. తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి చెప్పారు. అయితే.. గంజాయి తరలిస్తున్న ఇద్దరు తిరువూరుకు చెందిన కొలికపోగు చందు, మద్దిరాల జయదేవ్‌ మానిక్‌గా గుర్తించారు. వీరిద్దరు జల్సాలకు అలవాటు పడి.. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో గంజాయి తరలింపులకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధానించారు. మరోసారి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్ద పదార్థాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story

Most Viewed