బట్టల వ్యాపారి వేధింపులకు యువకుడి అత్మహత్య..

by Disha Web Desk 20 |
బట్టల వ్యాపారి వేధింపులకు యువకుడి అత్మహత్య..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బట్టల వ్యాపారీ వేదింపులు భరించలేక యువకుడు అత్మహత్యకు పాల్పడ్డారు. అత్మహత్యకు ముందు తన అత్మహత్యకు బోదన్ కు చెందిన బట్టల వ్యాపారీ కారణం అని ఓక చిట్టిపై రాసీ బలవన్మరణంకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం వెలుగు చూసిన ఘటనతో బట్టల వ్యాపారులు కేసును తారుమారు చేసేందుకు యత్నాలు చేశారు. రూద్రూర్ మండల కేంద్రంలో ఉదయం నుంచి హైడ్రామా జరిగింది. నిజామాబాద్ జిల్లా రూద్రుర్ మండల కేంద్రానికి చెందిన అవిటి రాజు (32) తన ఇంటిలోనే గురువారం రాత్రి దులానికి ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఈ విషయం బహిర్గతమైంది. అవిటి రాజు తనఅత్మహత్యకు ముందు తాను బోదన్ లో పనిచేస్తున్న ఆశోక సేల్స్ టార్చర్ భరించలేక సచ్చిపోతున్నట్లు సూసైడ్ నోట్ ను రాశారు.

బట్టల దుకాణంకు సంబంధించిన రశీదులోనే లేఖ రాసీ చనిపోవడంతో కుటుంబ సభ్యులు రూద్రుర్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. మృతుడు రాజుకు భార్య ఇద్ధరు కుమారులు ఉన్నారు. అవిటి రాజు అత్మహత్య పిర్యాదు నేపథ్యంలో రూద్రుర్ ఎస్ఐ మశ్చీందర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితుని కుటుంబ సభ్యులు బోధన్ పట్టణంలోని ప్రముఖ బట్టల వ్యాపారి అశోక్ సేల్స్ వారి వేధింపుల వల్లే ఆవిటి రాజు అత్మహత్యకు పాల్పడినటు ఎస్సై మచ్చందర్ రెడ్డితో తెలిపారు. ఆయన రాసుకున్న సూసైడ్ నోట్లో కూడా అశోక్ సేల్స్ వారి వేధింపుల వల్లే చనిపోయినట్టు ఉంది అది ఇవ్వండి అంటూ ఎస్సై తో మొరయించుకున్నారు.

మాకెందుకు సూసైడ్ నోట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు నిలదీశారు, ఈ విషయంపై ఎస్ఐ మశ్చందర్ రెడ్డి చట్టపరంగా తాము న్యాయం చేస్తామని ఎవరు మాకు చుట్టం కాదని పోలీస్ స్టేషన్లో ఇస్తామని సమాధానం ఇవ్వడంతో వారు శాంతించారు. ప్రముఖ బట్టల వ్యాపారీ పేరును అవిటి రాజు అత్మహత్యకు కారణం అని రాయడంతో వారిని తప్పించే యత్నం జరుగుతుందని స్థానికులు పెద్ధ ఎత్తున వచ్చి పోలిస్ లతో వాగ్వివాదానికి దిగారు. సుమారు ఐదు గంటల పాటు హైడ్రామ జరిగింది. పోలిస్ లు న్యాయం చేస్తామనడంతో వారు శాంతించారు. అవిటి రాజు కుటుంబానికి నష్టపరిహరం ఇచ్చీ కేసును నీరుగార్చే యత్నలు జరిగాయి.



Next Story

Most Viewed