ఆపలేదని బస్సుపై రాయి విసిరిన మహిళ.. ఊహించని శిక్ష వేసిన అధికారులు

by Dishafeatures2 |
ఆపలేదని బస్సుపై రాయి విసిరిన మహిళ.. ఊహించని శిక్ష వేసిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో ఏ బస్సు చూసినా మహిళలతో క్రిక్కిరిసిపోతున్నాయి. కాగా తాజాగా లక్ష్మి అనే ఓ మహిళ బస్సును ఆపగా.. డ్రైవర్ బస్సును ఆపలేదు. వేశానికి లోనైన ఆమె కొప్పల్-హోసాపేట నాన్ స్టాప్ బస్సుపై రాయి విసిరింది. దీంతో బస్సు అద్దాలు పగిలాయి. గమనించిన బస్సును ఆపిన డ్రైవర్ ముత్తప్ప సదరు మహిళను బస్సులోకి ఎక్కించుకున్నాడు.

అనంతరం బస్సును పోలీస్ స్టేషన్ లోపలికి పోనిచ్చి సదరు మహిళపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే తాను గంటల తరబడి బస్సు స్టాప్ లో వేచి ఉన్నానని, ఎవరూ కూడా బస్సు ఆపలేదన్న కోపంతోనే రాయి విసిరినట్లు ఆ మహిళ పేర్కొంది. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న మహిళ.. పోలీసులు చెప్పినట్లు రూ. 5 వేల ఫైన్ కట్టి అదే బస్సులో తన స్వగ్రామమైన ఇల్కల్ కు వెళ్లింది.


Next Story

Most Viewed