స్కూటీ అదుపుతప్పి మహిళా కానిస్టేబుల్ మృతి

by Shiva |
స్కూటీ అదుపుతప్పి మహిళా కానిస్టేబుల్ మృతి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : స్కూటీ అదుపుతప్పి ఓ మహిళా కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మల్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న వేదశ్రీ అనే కానిస్టేబుల్ విధులు ముగించుకొని సోమవారం మధ్యాహ్నం తన స్కూటీ పై ఇంటికి తిరిగి వెళ్తుంది. ఈ క్రమంలో మల్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట స్కూటీ అదుపుతప్పి వేదశ్రీ కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వేదశ్రీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ భాస్కర్ ఆసుపత్రికి చేరుకొని వేదశ్రీ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె వేదశ్రీ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు.

Advertisement

Next Story