భర్తను హత్య చేసిన భార్య.. దాని గురించి తెలుసుకున్నాడని..

by Dishafeatures2 |
భర్తను హత్య చేసిన భార్య.. దాని గురించి తెలుసుకున్నాడని..
X

దిశ, వెబ్‌డెస్క్: అన్యోన్యంగా జీవితాంతం కలిసి ఉండాల్సిన వివాహ బంధాన్ని వివాహేతర సంబంధాలు కకలావికలం చేస్తున్నాయి. వివాహమైన తర్వాత కూడా వేరే వ్యక్తుల ప్రేమలో మునిగి అయిన వారినే కడతేరుస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలో మరొకటి వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్నాడని భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన గ్రేట్ నొయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల భార్య తన వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసిపోయిందని భర్తను హత్య చేసింది. నిందితురాలు తన చున్నీని భర్త మెడకు చుట్టింది. అనంతరం అతడిని తలను గోడకేసి గట్టిగా కొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. వీరిద్దరి పెళ్లై పది సంవత్సరాలు గడుస్తున్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed