జమ్మూకశ్మీర్, ఉత్తర భారతంలో భూకంపం

by Dishafeatures2 |
జమ్మూకశ్మీర్, ఉత్తర భారతంలో భూకంపం
X

జమ్మూ: జమ్మూకశ్మీర్, ఢిల్లీ, ఉత్తర భారతంలోని మరికొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరు భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.4గా నమోదైన ఈ భూకంపం వల్ల స్కూలు బిల్డింగ్ లతో సహా 100కు పైగా భవనాలు దెబ్బతిన్నాయి. ఒక జవాను, ఒక మహిళ, మరో బాలుడు గాయపడ్డారు. కిష్త్వార్, దోడా జిల్లాలు, లోయలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.33 గంటలకు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లా గాందోహ్ భాలెస్సా అనే మారుమూల గ్రామంలో భూకంప కేంద్రం 60 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. భయభ్రాంతులకు గురైన స్కూలు పిల్లలు, షాపుల యజమానులు రోడ్డుపైకి పరిగెత్తారు.

జమ్మూకశ్మీర్ లో తెల్లవారుజామున కూడా 9 నిమిషాల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ తదితర ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపనలు ఏర్పడ్డాయి. దీని తీవ్రత తక్కువగా ఉండటంతో జమ్మూకశ్మీర్ లో మినహా ఇతర ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.





Next Story