పీఎఫ్ఐ శిక్షణ పొందిన ముగ్గురి కోసం ఎన్ఐఏ గాలింపు

by Dishafeatures2 |
పీఎఫ్ఐ శిక్షణ పొందిన ముగ్గురి కోసం ఎన్ఐఏ గాలింపు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఆటోనగర్ లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)లో శిక్షణ తీసుకుని కీలకంగా వ్యవహరించిన ముగ్గురి కోసం నేషనల్ ఇన్షెస్టిగేషన్ ఏజెన్సీ వేట కొనసాగిస్తుంది. నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ లో గతేడాది నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ నిషేధిత పీఎఫ్ఐ మూలాలు కలిగిన సభ్యుల కోసం సూత్రదారుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే. స్థానిక పోలీసుల నుంచి ఎన్ఐఏ 2022 ఆగస్టు 26న కేసును బదులాయించి విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ ఖాదార్ సూత్రదారిగా ఆటోనగర్ లో పీఎఫ్ఐ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటూ ఉగ్రశిక్షణ ఇస్తున్నారని గతేడాది కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. మొత్తం 28 మంది మీద కేసు నమోదు చేసిన పోలీసులు అబ్దుల్ ఖాదర్ తో పాటు షేక్ షాదుల్లా, ఎండి ఇమ్రాన్, అబ్దుల్ మోబిన్ లపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మిగిలిన వారి కోసం ఆనాటి నుంచి వేట కొనసాగుతూనే ఉంది.

నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ లో గతేడాది నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ నిషేధిత పీఎఫ్ఐ మూలాలు కలిగిన సభ్యుల కోసం సూత్రదారుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే. స్థానిక పోలీసుల నుంచి ఎన్ఐఏ 2022 ఆగస్టు 26న కేసును బదులాయించి విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ ఖాదార్ సూత్రదారిగా ఆటోనగర్ లో పీఎఫ్ఐ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటూ ఉగ్రశిక్షణ ఇస్తున్నారని గతేడాది కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. మొత్తం 28 మంది మీద కేసు నమోదు చేసిన పోలీసులు అబ్దుల్ ఖాదర్ తో పాటు షేక్ షాదుల్లా, ఎండి ఇమ్రాన్, అబ్దుల్ మోబిన్ లపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మిగిలిన వారి కోసం ఆనాటి నుంచి వేట కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నిజామాబాద్ నగరంలోని మాలపల్లి ముజాయిహిద్ నగర్ కు చెందిన మహ్మద్ అబ్దుల్ అహాద్ తో పాటు పొరుగున ఉన్న జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన అబ్దుల్ సలీం, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఖాజానగర్ కు చెందిన షేక్ ఇలియాస్ ల కోసం వేట కొనసాగిస్తుంది. ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 28 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన ముగ్గురి ఆచూకీ ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అబ్దుల్ అహాద్, అబ్దుల్ సలీం, షేక్ ఇలియాస్ లపై రివార్డును ప్రకటించింది. వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.2 లక్షల రివార్డును ప్రకటించింది.

నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ లో వెలుగు చూసిన పీఎఫ్ఐ కేసు ఏడాది కాలంగా విచారణ సాగుతున్న ఆ ముగ్గురు మాత్రం ఆచూకీ లేకపోవడంతో వారు అండర్ గ్రౌండ్ లో ఉండి ఉంటారని ఎన్ఐఏ ఆధ్వర్యంలో పట్టుకునేందుకు సోదాలు చేస్తున్నారు. నిజామాబాద్ నగరం కేంద్రంగా పీఎఫ్ఐ శిక్షణ సమయంలో సుమారు 200 మందికి పైగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరిట ఉమ్మడి తెలుగు రాస్ట్రాలకు చెందిన వారికి శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి అందులో శిక్షణ పొందిన వారికి నోటీసులు ఇచ్చి ఎన్ఐఏ కార్యాలయానికి పిలిపించి విచారణ పరిపాటిగా మారింది. ఈ కేసు మొదట్లో గుండారంకు చెందిన షేక్ షాదుల్లా అనే వ్యక్తి జిల్లా పీఎఫ్ఐ కన్వీనర్ గా శిక్షణకు రూపకల్పన చేసిన విషయం గుర్తించిన విషయం విధితమే. పీఎఫ్ఐ శిక్షణ కొరకు ఆర్థిక మూలాలు విదేశాల నుంచి వచ్చాయని చాలా మందిని అప్పట్లో విచారించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు గల్ప్ దేశాల్లో ఉంటూ వారికి నిధులు సమకూర్చిన విషయంపై విచారణ జరిగింది. ఇప్పటి వరకు ఎన్ఐఏ అరెస్టు చేసిన వారి సంఖ్య బహిర్గతం చేయకపోయినా దేశ ద్రోహం కేసులు నమోదైన వారందరిరనీ కటకటాలకు పంపినట్లు సమాచారం. కీలకంగా వ్యవహరించిన మరో ముగ్గురి వేటకు నిఘా కొనసాగుతున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. కేసు ఎన్ఐఏకు బదులాయింపు జరిగి వారే విచారణ చేస్తుండడంతో స్థానిక పోలీసులు సంబంధిత సమాచారం తెలియదని చెబుతున్నారు.



Next Story

Most Viewed