నలుగురు అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలు అరెస్టు

by Dishafeatures2 |
నలుగురు అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలు అరెస్టు
X

దిశ, కడప: మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర మోటార్ సైకిల్ దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అరెస్టు అయిన వారిలో ఎర్రగుంట్ల టౌన్ సుందరయ్య నగర్ చెందిన మల్లె పోగు ప్రసాద్, మైలవరం మండలం చెందిన గువ్వల పుల్లారెడ్డి, ఎర్రగుంట్ల అంబేద్కర్ నగర్ చెందిన దండు నరసింహులు, ఎర్రగుంట్ల ప్రకాష్ నగర్ చెందిన పిక్కిలి చరణ్ కుమారులు ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిలు సీసీ కెమెరాలు లేని ప్రదేశాల్లో పార్కింగ్ చేయబడిన వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఈ దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల కాలంలోనే 25 మోటార్ సైకిల్ దొంగిలించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, అనంతపురం జిల్లా,శ్రీ సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాలలో తోపాటు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ చోరీలు చేసినట్లు తెలిపారు.

ద్విచక్ర వాహనాలను చోరీచేసిన ప్రాంతాలను పరిశీలిస్తే ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పీఎస్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శ్రీశైలం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ గుంతకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు సత్యసాయి జిల్లా బత్తలపల్లి పోలీస్ స్టేషన్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్నస్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ రాష్ట్రం సైఫాబాద్ ముషీరాబాద్ శంషాబాద్ పరిధిలో 7 మోటార్ సైకిల్ కర్ణాటక రాష్ట్రం పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు మోటార్ సైకిల్స్ చోరీకి గురికాగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముద్దాయిలను పట్టుకుని మోటార్ సైకిల్ రికవరీలో చాకచక్యంగా వ్యవహరించిన జమ్మలమడుగు డిఎస్పి ఎస్ నాగరాజు ఎర్రగుంట్ల అర్బన్ ఇన్స్పెక్టర్ మంజునాథరెడ్డి, కడప సిసిఎస్ ఇన్స్పెక్టర్ దేవకిరణ్ ఎస్ఐలు బీవీ కృష్ణయ్య,ప్రవీణ్ కుమార్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రివార్డులతో అభినందించారు.



Next Story

Most Viewed