అల్లాదుర్గంలో చిరుత కలకలం..

by Disha Web Desk 1 |
అల్లాదుర్గంలో చిరుత కలకలం..
X

భయాందోళనలో కాయిదంపల్లి గ్రామస్థులు

దిశ, అల్లాదుర్గం : చిరుతపులి సంచారం చేస్తూ ఓ లేగ దూడను బలి తీసుకున్న ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమయ్య అనే రైతు తన వ్యవసాయ పొలాల వద్ద దూడను కట్టేసి వారు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పంట పొలాలను అనుకోని అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత అకస్మాత్తుగా లేగదూడపై దాడి చేసి లాక్కోని వెళ్లి చంపి తినేసింది. కొన్ని రోజులుగా చిరుత సంచారం చేస్తుందనే ఆరోపణలు వాస్తవమే అని ఈ సంఘటనతో తేటతెల్లమైంది.

దీంతో గ్రామస్థులు సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పటు చేసి గట్టి నిఘాతో చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రైతులు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లకూడదని గ్రామంలో దండోరా వేయించి గ్రమస్థులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోనే రైతులు తమ పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏ సమయంలో తమపై చిరుత దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.



Next Story