మూగజీవిపై మూర్ఖుల దాడి.. మూలుగుతున్నా వదల్లేదు(వీడియో)

by Disha Web |
మూగజీవిపై మూర్ఖుల దాడి.. మూలుగుతున్నా వదల్లేదు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈమధ్య డాగ్ ప్రేమికులు విపరీతంగా పెరిగిపోయారు. నమ్మకం, విశ్వాసం కలిగిన డాగ్స్‌పై అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. ఇక అలాంటి డాగ్స్‌కు చిన్న గాయమైన తట్టుకోలేని ప్రియులు.. ఇద్దరు వ్యక్తులు శునకంపై జాలి, దయ లేకుండా అతి దారుణంగా కొట్టిన వీడియో చూసి చలించిపోతున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఇద్దరు వ్యక్తులు రోడ్డున పోతుంటే వాళ్లని చూసి శునకం అరిచిందని ఆ యువకులు కుక్కపై దారుణానికి తెగబడ్డారు. శునకం కాళ్లకు చెయిన్‌తో కట్టేసి దుడ్డు కర్రలతో చితకబాదారు. వాళ్లు కొట్టే దెబ్బలకు బాధతో మూలుగుతున్నా.. కనికారం లేకుండా కొట్టారు. ఇక వాళ్లని ఆపడానికి ప్రయత్నించిన వారిని తోసేసి శునకంపై విరుచుకుపడ్డారు. అనంతరం అక్కడికి చేరుకున్న యజమాని ప్రశ్నించడంతో వెళ్లిపోయారు. దీంతో ఆ యజమాని గాయపడిన డాగ్‌ను వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ఇక ఈ వీడియో వైరల్ అవడంతో వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అనంతరం ఆ యజమానిని సంప్రదించగా.. ఫిర్యాదు చేయడానికి అతను అంగీకరించినట్లు సమాచారం.

Next Story

Most Viewed