- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బాలాపూర్‌లో దారుణం..బాబాయ్, కూతురిపై కత్తితో దాడిచేసిన బీహార్ యువకుడు..
దిశ, బడంగ్పేట్ : వరుసకు కూతురు అయిన అమ్మాయిని చెడు ఉద్దేశంతో ఎందుకు చూస్తున్నావని మందలించబోయిన బాబాయ్‌ని బీహార్ యువకుడు కత్తితో దాడిచేసి హతమార్చిన ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాబాయ్‌పై దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన కూతురిపై సైతం కత్తితో దాడికి తెగబడిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం .. ఛత్తీస్ ఘడ్ బస్తర్ జిల్లాకు చెందిన ఉర్మిళ కశ్యప్ (22) గత కొంత కాలంగా కొంతమంది స్థానికులతో కలిసి మల్లాపూర్ ప్రాంతంలో ప్లేఉడ్ డోర్స్ కార్ఖానా లో పనిచేస్తూ వరుసకు బాబాయ్ అయిన ఖాన్కుడి కశ్యప్(30)తో కలిసి ఉంటుంది. వీరి పక్కనే నివసించే బీహార్‌కు చెందిన బంటి అనే యువకుడు ఉర్మిళ కశ్యప్‌ను చెడు ఉద్దేశ్యంతో చూసేవాడు.
ఈ నెల 4వ తేదీన రాత్రి 10.30గంటల సమయంలో మరోసారి బంటి ఆమెను చెడు ఉద్దేశ్యంతో చూడడంతో సదరు యువతి దుర్భాషలాడింది. అప్పుడే ఇంటికి వచ్చిన బాబాయ్ ఖాన్కుడి కశ్యప్ కు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఖాన్కుడి కశ్యప్ పక్కనే ఉండే బంటిని ప్రశ్నించాడు? అప్పటికే బంటి మద్యం సేవించి ఖాన్ కూడితో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాటమాట పెరగడంతో కోపోద్రిక్తుడైన బంటి కూరగాయాలు కట్ చేసే కత్తితో అతనిపై దాడిచేశాడు. అడ్డుకోబోయిన ఉర్మిళపై కూడా కత్తితో దాడిచేశాడు. తీవ్ర గాయాలపాలైన ఖాన్కుడి కశ్యప్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఉర్మిళకు చేతికి కత్తిగాయాలయ్యాయి. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.