మార్గదర్శి కేసులో వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు సీజ్​

by Dishafeatures2 |
మార్గదర్శి కేసులో వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు సీజ్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మార్గదర్శి ఛిట్​ఫండ్​కేసులో ఇప్పటివరకు 1,035 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సీజ్​చేసినట్టు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ సంజయ్​కుమార్​చెప్పారు. తమపై ఎవ్వరి ఒత్తిడి లేదన్నారు. హైదరాబాద్​లోని లేక్​వ్యూ గెస్ట్​హౌస్​లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్గదర్శి చిట్​ఫండ్స్​కు సంబంధించి ఇప్పటివరకు ఏడు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఏడు బృందాలతో ఏడు బ్రాంచీల్లో తనిఖీలు నిర్వహించి నలుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అరెస్టయిన వారిలో ఆడిటర్​కూడా ఉన్నట్టు చెప్పారు. ఇక, మార్గదర్శి చిట్​ఫండ్స్​కేసులో రామోజీరావును గతంలో హైదరాబాద్​లో ప్రశ్నించినట్టు తెలిపారు. సంస్థ ఎండీగా ఉన్న శైలజా కిరణ్​ను రెండుసార్లు ప్రశ్నించినట్టు చెప్పారు. మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో కీలక పత్రాలు దొరికినట్టు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తోపాటు మరో రెండు రాష్ర్టాల్లో మార్గదర్శి 108 బ్రాంచీలతో వ్యాపారం చేస్తున్నట్టు వివరించారు.

ఒత్తిడి వస్తున్న నేపథ్యంలోనే సీఐడీ విచారణ జరుగుతోందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. రిజిస్ర్టార్​ఆఫ్​కంపెనీస్​అధికారులను కలిసి అన్ని వివరాలు సేకరించినట్టు తెలిపారు. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్​ను కలిసి అన్ని విషయాలు చెప్పినట్టు పేర్కొన్నారు. ఇక, సంస్థకు చెందిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వం అటాచ్​చేసిందని, దీంట్లో కొన్ని ఫిక్స్​డ్​డిపాజిట్లు, కొన్ని మ్యూచువల్​ఫండ్స్​ఉన్నాయన్నారు. సంస్థ మూతపడితే ఖాతాదారులకు డబ్బులు వాపసు ఇవ్వాల్సిన బాధ్యత స్టాంప్స్​అండ్​రిజిస్ర్టేషన్​శాఖదే అని చెప్పారు. చిట్​ఫండ్​యాక్ట్​సెక్షన్​12 ప్రకారం చిట్​ఫండ్​వ్యాపారంలో వచ్చిన డబ్బుతో వేరే వ్యాపారాలు చేయటానికి వీల్లేదని తెలిపారు. కంపెనీస్​యాక్ట్​ప్రకారం తాము అన్ని వివరాలను ఫైల్​చేస్తున్నామని శైలజా కిరణ్​చెబుతున్నారని అన్నారు. మార్గదర్శి సంస్థ రిజిస్ర్టేషన్​అయ్యింది కంపెనీస్​యాక్ట్​ప్రకారమే అని అంటున్నారన్నారు. అయితే, ఆ తరువాత చిట్​ఫండ్స్​యాక్ట్​అమల్లోకి వచ్చిందని అదనపు డీజీ సంజయ్​కుమార్​చెప్పారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్​ఫండ్స్​కూడా ఈ యాక్ట్​కిందకే వస్తుందని అన్నారు. అయినా, మార్గదర్శి చిట్​ఫండ్స్​సంస్థ ఈ చట్టాన్ని పాటించటం లేదని చెప్పారు.

ఈ వ్యాపారంలో వస్తున్న నిధులను వేరే వ్యాపారాలకు మళ్లించినట్టు తెలిపారు. దర్యాప్తు అధికారులు తప్పు చేస్తే పై అధికారులకు ఫిర్యాదు చేయాలిగానీ చేతిలో పత్రిక ఉందని వారి ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా వార్తలు రాస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని మార్గదర్శి చిట్​ఫండ్స్​కు సంబంధించిన తొమ్మిది బ్రాంచీల్లో మొత్తం ఇరవై మూడు గ్రూపులను స్టాంప్స్​అండ్​రిజిస్ర్టేషన్​శాఖ పూర్తిగా మాసివేయనున్నట్టు చెప్పారు. ఈ గ్రూపుల్లో ఉన్న సభ్యులందరికీ డబ్బు వాపసు ఇస్తామన్నారు. చిట్​రిజిస్ర్టార్​అనే వ్యవస్థను వాడుకుని చిట్టీలకు ష్యూరిటీ ఇచ్చిన వారి ఆస్తులను సంస్థ అటాచ్​చేస్తోందని చెప్పారు. అలాంటపుడు చిట్​ఫండ్​యాక్ట్​ప్రకారం వివరాలు ఎందుకు నమోదు చేయరని ప్రశ్నించారు. రామోజీరావు వయసుకు గౌరవం ఇచ్చి హైదరాబాద్​వచ్చివ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. గ్రూపుల్లోని సభ్యులు చిట్టీ పాడుకుంటే డబ్బు ఇవ్వకుండా తమ సంస్థలోనే ఫిక్స్​డ్​డిపాజిట్లు చేసుకుంటున్నట్టు తెలిపారు. సభ్యుల ఆధార్​కార్డు, పాన్​కార్డు నిబంధనలను అస్సలు పాటించటం లేదని చెప్పారు. ఇవన్నీ అన్​అకౌంటబుల్​ఖాతాలని తెలిపారు. ఈ కేసులో సీఐడీపై ఎవ్వరి ఒత్తడి లేదని అంటూ చట్ట ప్రకారమే విచారణ చేస్తున్నట్టు వివరించారు.



Next Story

Most Viewed