మహిళపై లైంగిక వేధింపుల కేసులో వ్యక్తికి రెండేళ్ళ శిక్ష

by Dishafeatures2 |
మహిళపై లైంగిక వేధింపుల కేసులో వ్యక్తికి రెండేళ్ళ  శిక్ష
X

దిశ, కమలాపురం: వైయస్సార్ జిల్లా పెండ్లి నీళ్ళుమర్రి మండల పరిధిలో ఒకటిన్నర సంవత్సరము క్రితం జరిగిన మహిళను వేధించిన (ఫాస్ట్ ట్రాక్ )కేసులో ముద్దాయి నూకనబోయిన ప్రహ్లాదుడు కు రెండు సంవత్సరాల కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కడప ఏడవ అదనపు జిల్లా కోర్టు ఇంచార్జ్ జడ్జి జి.గీతా బుధవారం తీర్పు ఇచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే పెండ్లిమర్రి మండలం ఉలవలపల్లి గ్రామములో నివాసం ఉంటున్న ముద్దాయి నూకనబోయిన ప్రహ్లాదుడు నూకనబోయిన నర్సమ్మ ను వెంబడిస్తూ, ఫోన్లో మాట్లాడుతూ వేధిస్తున్నట్లు 2022 జనవరి 1 వతేదీ ఉదయం సుమారు ఐదున్నర గంటల సమయంలో ఫిర్యాది కాలకృత్యాలకు పోయి ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో సుందరి వెంకట శివుడు అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చేటప్పటికి ముద్దాయి మాటు వేసి ఉన్నాడు. మహిళను పట్టుకొని పక్కకు లాక్కొని పోయి బలాత్కరించే ప్రయత్నం చేశాడు.

మహిళ గట్టిగా కేకలు వేయగా, కేకలు విన్న చుట్టు పక్కల వారు వచ్చేసరికి ముద్దాయి పారిపోయాడు. పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారించి అప్పటి ఎస్.హెచ్.ఓ అయిన ఏ.ఎస్.ఐ వి.శ్రీనివాసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి అనంతరం సాక్షులను విచారించారు. తర్వాత యస్.ఐ ఎన్.రాజరాజేశ్వర్ రెడ్డి విచారణ చేసి చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పి.పి డి. ప్రతాప్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలతో ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ బి.మధుసూదన్ రావు, సిబ్బంది ఏ.ఎస్.ఐ నారాయణ, హెడ్ కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ లను జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ అభినందించారు.



Next Story

Most Viewed