బీహార్లో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్

by Javid Pasha |
బీహార్లో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ లోని భాగల్ పూర్ లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఖగేరియా, భాగల్ పూర్ జిల్లాలను కలుపుతూ అగువని సుల్తాన్‌గంజ్ గంగా బ్రిడ్జిని రూ.1,700 కోట్లతో నిర్మిస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే రెండు భాగాలు ఒకదాని వెంట మరొకటి కుప్పకూలాయి. ఈ ఘటనను కొందరు కెమెరాలతో చిత్రీకరించారు. కాగా రెండేల్ల కిందట కూడా ఈ వంతెనలో కొంత భాగం కుప్పకూలింది. ఇక ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.



Next Story