కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లల మృతి..

by Disha Web Desk 11 |
కుక్కల దాడిలో  25 గొర్రె పిల్లల మృతి..
X

దిశ, మక్తల్: గొర్రె పిల్లల మందపై కుక్కలు దాడి చేయడయంతో 25 గొర్రె పిల్లలు మృతి చెందగా, మరో 20 గొర్రెపిల్లలు తీవ్రంగా గాయపడినాయి. ఈ సంఘటన మక్తల్ మండల పరిధిలోని గుర్లపల్లి గ్రామ శివారులో మంగళ వారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మక్తల్ పట్టణానికి చెందిన కురువ సురేష్ గుర్లపల్లి రోడ్డు పొలాల్లో గొర్రెలను మేపడానికి తీసుకెళ్లగా గొర్రె పిల్లలను ఇనుప కంచెలో ఉంచాడు.

కాగా గొర్రె పిల్లల మందపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి 25 గొర్రె పిల్లలను చంపేశాయి. మరో ఇరవై గొర్రె పిల్లలను తీవ్రంగా పరిచాయని యాజమాని కుర్వ సురేష్ తెలిపాడు. చనిపోయిన, గాయపడిన గొర్రెపిల్లల విలువ లక్ష యాభై వేలు ఉంటుందని తెలిపాడు. ఆర్థికంగా నష్టపోయిన తమను ఎమ్మెల్యే ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.

Next Story

Most Viewed