బాల్ టు బాల్ క్రికెట్ బెట్టింగ్.. యువతదే కీ రోల్

by  |
Cricket betting gang
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల కేంద్రంగా టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. జడ్చర్ల ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివాసముంటూ వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్థానిక యువతతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉద్యోగాలు చేసే వారు సైతం గుట్టుచప్పుడు కాకుండా టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో టాస్ నుంచి మొదలుకొని ప్రతీ బాల్ టు బాల్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో భారీ మొత్తంలో బెట్టింగ్ జరుగుతోందని సమాచారం.

సామాజిక మధ్యమాలే ప్రచారాస్త్రాలు..

ఇంతకుముందు సెల్ఫోన్లలో మాట్లాడుకుంటూ పందాలు కాసే వారు. చాలామంది టీవీల్లో మ్యాచులు చూస్తూ లాడ్జింగులు, హోటళ్లలో కూర్చొని కూడా బెట్టింగులు చేసేవారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ రాయుళ్లు టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభానికి ముందే గ్రూపులుగా ఏర్పడ్డారు. వాట్సాప్ గ్రూపులు సైతం ఏర్పాటు చేసుకున్నారు. 10 మందికి ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లు ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తున్నారని, పది మందికి ఒకరూ చొప్పున బెట్టింగ్ రాయుళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. వీరికి మ్యాచ్ ఓడినా, గెలిచినా ఐదు శాతం చొప్పున చెల్లిస్తారని.. ఈ రకంగా యువతను బెట్టింగ్ వైపు ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed