చిన్న పరిశ్రమలకు క్రెడిట్ అందించేందుకు యూపీఐ లాంటి ప్లాట్‌ఫామ్ కావాలి!

by  |
Ashwini Vaishnaw
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారవేత్తల కోసం త్వరగా, సులభంగా క్రెడిట్ అందించేందుకు వీలుగా యూపీఐ లాంటి శక్తివంతమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్ రూపొందించాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆదివారం బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించి జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అటువంటి ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి అవసరమైన వనరులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, ఆధార్, మొబైల్ ఫోన్, యూపీఐ, డిజిలాకర్ లాంటివి ఉన్నాయని, రాబోయే మూడు నెలల్లో మరింత శక్తివంతమైన పరిష్కారాలను అందించాలని అశ్విని వైష్ణవ్ బ్యాంకింగ్ పరిశ్రమను కోరారు. ఎంఎస్ఎంఈ, చిన్న పరిశ్రమల వారికి సులభమైన యూపీఐ తరహా ప్లాట్‌ఫామ్ అవసరం ఉంది. మూడు నెలల తర్వాత వచ్చే కాన్సెప్ట్‌లను పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రధానంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారులకు క్రెడిట్ అందించేందుకు ఊదేశించినదని ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed