‘పవన్ కళ్యాణ్ బీజేపీ దోస్తీ వీడితే బాగుంటుంది’

by  |
‘పవన్ కళ్యాణ్ బీజేపీ దోస్తీ వీడితే బాగుంటుంది’
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేన, బీజేపీ కలిసి పనిచేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. గురువారం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్వతహాగా సెక్యూలర్ భావాలున్న వ్యక్తి, బీజేపీ నుండి బయటకు వస్తే బాగుంటుంది అని అన్నారు. ఏపీలో ప్రజల కష్టాలపై పవన్ కళ్యాణ్ నిరంతరం పోరాటం చేస్తున్నాడని తెలిపారు. అలాంటి వ్యక్తి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే బీజేపీతో కలిసి పనిచేయడం బాగాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ బీజేపీ అన్ని రకాలుగా మోసం చేసిందని వెల్లడించారు. జనసేన పార్టీ సెక్యూలర్ పార్టీ అని, కానీ ఇప్పుడు కమ్యూనల్ పార్టీతో పొత్తులో ఉందని గుర్తుచేశారు. తాము జనసేనతో కలిసి పనిచేసామని, అందుకే చెబుతున్నామని, పవన్ స్వతహాగా సెక్యూలర్ భావాలున్న వ్యక్తి అని రామకృష్ణ చెప్పారు.

Next Story