‘రాజ్యాంగ హక్కుల అమలు కోసం పోరాటం చేస్తాం’

by  |
‘రాజ్యాంగ హక్కుల అమలు కోసం పోరాటం చేస్తాం’
X

దిశ, భద్రాచలం అర్బన్ : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా “రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం-దేశాన్ని కాపాడుకుందాం ” అనే నినాదంతో అంబేడ్కర్ కూడలి వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ‌‌కై కార్యక్రమం నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా CPI పట్టణ కార్యదర్శి అకోజు సునీల్ కుమార్, AITUC పట్టణ కార్యదర్శి బల్లా సాయి కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టమని, భారత రాజ్యాంగం ద్వారా దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చిందని, భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిందని వారు అన్నారు. అయితే భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ప్రాథమిక హక్కులను అమలు చేయకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు.

కేంద్ర ప్రభుత్వం మత ఛాందస విధానాలతో దేశాన్ని పాలిస్తున్నదని, హిందూత్వ అజెండాతో విధానాలను ప్రజలపై రుద్ది , మత విద్వేషాలను సృష్టించాలని కుయుక్తులు పన్నుతున్నదని వారు ఉద్ఘాటించారు. మోడీ విధానాలు దేశానికి ప్రమాదమని, ఈ విధానాలతో రాజ్యాంగం ప్రమాదపు అంచుల్లో పడే పరిస్థితులు ఉన్నాయని వారు ఆరోపించారు. అదేవిధంగా రాజ్యాంగ స్పూర్తితో మహిళా హక్కుల పోరాటాలను ఉధృతం చేస్తామని వారు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే ప్రజాస్వామ్య పరిరక్షకులుగా తమపై బాధ్యత ఉన్నదని, సమాజమంతటా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలు, కార్మిక లోకంలో ప్రజ్వలింపజేస్తామని చైతన్య పరుస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో CPI AITUC నాయకులు మీసాల భాస్కరరావు షడాలు, కల్లూరి శ్రీ రాములు, AIYF నాయకులు ప్రదీప్, బద్ది DHPS నాయకులు సత్యానంద్, బాబీ, సతీష్, రాయల రాము,లక్మి, లతో పాటు 30 మంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed