యువతికి తెలిసిన వ్యక్తితో పరిచయమై గ్యాంగ్ రేప్.. ఆరుగురికి రిమాండ్

by  |
యువతికి తెలిసిన వ్యక్తితో పరిచయమై గ్యాంగ్ రేప్.. ఆరుగురికి రిమాండ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్‌లో జరిగిన యువతి గ్యాంగ్ రేప్ ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. గురువారం నిజామాబాద్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీపీ కార్తీకేయ కథనం ప్రకారం.. జక్రాన్ పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి నగరంలో డిగ్రీ చదువుతోందన్నారు.

ఈ నెల 28న సాయంత్రం ఆ యువతికి తెలిసిన నవీన్ అనే వ్యక్తి ద్వారా సిరిగాద చరణ్, చంద్రశేఖర్ పరిచయం అయ్యారు. వారి ద్వారా కరీం, భాను ప్రకాష్, గంగాధర్‌లు యువతిని కలిశారు.అందరూ కలిసి అంకాపూర్‌కు వెళ్లి బిర్యాని తిని, బీర్లు తీసుకుని బస్టాండ్ వద్ధ పునరుద్ధరణ పనులు జరుగుతున్న తిరుమల ఆసుపత్రిలో గదిలో యువతితో కలిసి బీర్లు సేవించి అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి తిరుమల ఆసుపత్రిలో యువకులు గొడవ చేయడంతో స్థానికంగా సౌతిండియా షాపింగ్ మాల్‌కు చెందిన వాచ్‌మెన్ డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అక్కడ ఉన్నయువతిని జిల్లా ఆసుపత్రికి తరలించి, యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లిన తరువాత సఖీ కేంద్రానికి తరలించారు. అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్ బాధితురాలిని విచారించిన అనంతరం ఆరుగురు యువకులను గుర్తించామని సీపీ తెలిపారు.దీంతో నిందితులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు అపస్మారక స్థితిలో ఉండటంతో విచారణ ఆలస్యమైనా.. 24 గంటల్లో యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరుగురిని రిమాండ్ పంపినట్టు తెలిపారు. ఈ కేసును నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ జరగగా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ అరవింద్ బాబు, ఉషా విశ్వనాధ్, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed