సిద్దిపేట పోలింగ్‌కు 465 మందితో పటిష్ట బందోబస్తు

by  |
సిద్దిపేట పోలింగ్‌కు 465 మందితో పటిష్ట బందోబస్తు
X

దిశ, సిద్దిపేట : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 30న జరుగనున్న నేపథ్యంలో పట్టణంలోని ఇంద్రానగర్, రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న సెట్విన్ సెంటర్, నెహ్రూ యువ కేంద్రం, మహిళా సమైక్య భవనం, ఐకేపీ కార్యాలయంలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి మున్సిపల్, రెవెన్యూ, డిపార్ట్‌మెంట్‌తో కలిసి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్, మాస్కులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రశాంతమైన వాతావరణ ఎన్నికలు నిర్వహించడానికి అడిషనల్ డీసీపీలు-03, ఏసీపీలు-04, సీఐలు-14, ఎస్ఐలు-31, ఏఎస్ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, ఆర్మూడ్ రిజర్వ్ అధికారులు సిబ్బంది 415 మంది మొబైల్ పార్టీలు -11, స్ట్రైకింగ్ ఫోర్స్ -04, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్-04 నియమించినట్లు తెలిపారు. మొత్తం అధికారులు సిబ్బంది 465 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఏవరైనా పాల్పడితే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే నేరుగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 79011 00100, సిద్దిపేట డివిజన్ అడిషనల్ ఎస్పీ -94906 17009, ఏసీపీ గజ్వేల్- 83339 98684, డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్-83339 98699 ఫోన్ చేసి సమాచారం అందించాలని కమిషనర్ తెలిపినారు.

Next Story

Most Viewed