రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం

by  |
రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. దేశవ్యాప్తంగా ప్ర‌ధాని మోదీ శనివారం ఉద‌యం 10:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అనంతరం హైద‌రాబాద్‌లోని నిమ్స్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌, గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, యూపీహెచ్‌సీలో మంత్రి కేటీఆర్ టీకాల కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మేయర్ గుండా ప్రకాశరావు, కలెక్టర్ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు.



Next Story

Most Viewed