గూగుల్ మ్యాప్స్ కొవిడ్ అప్‌డేట్

by  |
గూగుల్ మ్యాప్స్ కొవిడ్ అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మానవుల జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇది ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. అలాగని పనులను ఆపుకోలేని పరిస్థితి. కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే భయం. అక్కడ కరోనా ఎలా ఉందో తెలుసుకుందామంటే ఎక్కువ అందుబాటులో ఉన్న సమాచారం కారణంగా ఎటు తోచని పరిస్థితి. ఈ సమస్యకు కూడా గూగుల్ పరిష్కారం చూపించింది. గూగుల్ మ్యాప్స్‌లో కొవిడ్‌కు సంబంధించి అప్‌డేట్ తీసుకొచ్చింది. కొవిడ్ 19 కొత్త వ్యూ ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా సంబంధిత ప్రాంతంలో కొవిడ్ కేసుల పరిస్థితి గురించి ఒక అవగాహన పొందవచ్చు.

ఈ లేబుల్ సాయంతో నిర్దేశిత ప్రాంతంలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవచ్చని మ్యాప్స్ ప్రొడక్టు మేనేజర్ సుజోయ్ బెనర్జీ తెలిపారు. ఈ సమాచారం వల్ల ఎక్కడికి వెళ్లడం సురక్షితం? ఎక్కడికి వెళ్లకూడదు అనే ప్రశ్నలకు సమాధానం దొరకడంతో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగకరంగా ఉంటుందని బెనర్జీ చెప్పారు. ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖల నుంచి అధికారిక సమాచారాన్ని ఉపయోగించి ఈ డేటాను రూపొందించినట్లు బెనర్జీ వెల్లడించారు. ఈ వారాంతంలో ఈ కొవిడ్ 19 లేయర్ గూగుల్ మ్యాప్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుందని గూగుల్ బ్లాగులో పేర్కొంది. ఇప్పటికే కొవిడ్‌కు సంబంధించి గూగుల్ మ్యాప్స్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ క్రౌడ్ టూల్ ఉన్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed