ఆ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సల అనుమతులు రద్ధు

by  |
ఆ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సల అనుమతులు రద్ధు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు నమోదుచేసి, అనవసర చికిత్సలందించిన మరో 6 ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. షోకాజ్ నోటీసులకు సరైన వివరణలివ్వని ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సల అనుమతులను రద్దు చేస్తున్నట్టుగా ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. తాజాగా కేపీహెచ్‌బీ కాలనీలోని పద్మజా ఆసుపత్రి, అల్వాల్ లోని లైఫ్‌లైన్ మెడిక్యూర్ ఆసుపత్రి, హనుమకొండలోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి, ఉప్పల్ లోని టీఎక్స్ ఆసుపత్రి, వరంగల్ అర్బన్ లోని లలితా ఆసుపత్రి, సంగారెడ్డిలోని శ్రీసాయి రాం ఆసుపత్రిలో కొవిడ్ చికిత్సల అనుమతులను రద్ధుచేశామని తెలిపారు.

ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా జులిపించింది. సోమవారం ఒక్క రోజే 26 ఆసుపత్రులపై 51 ఫిర్యాదులందినట్టుగా ప్రకటించారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 105 ఆసుపత్రులపై 166 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటన్నింటికి షోకాజ్ నోటీసులు అందించామని వివరించారు. పేషెంట్లకు చేపట్టిన చికిత్సలు, నమోదుచేసిన బిల్లుల గురించి సరైన వివరణలు అందించని ఆసుపత్రులపై కఠిన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.



Next Story