క‌రోనాపై ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్దు..

by  |
క‌రోనాపై ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్దు..
X

దిశ‌, పాలేరు: ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మద్దులపల్లి గ్రామంలోని గిరిజన యువత శిక్షణా కేంద్రం(ఐటీడీఏ)‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా గురించి ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన పనిలేదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా అదనంగా ఇక్కడ 70, మమత ఆసుపత్రిలో 130 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, శారదా ఇంజినీరింగ్ కళాశాలలో కూడా కోవిడ్ హెల్త్ కేర్ ఏర్పాటు చేస్తామన్నారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 98.5% ఉండగా, మరణాలు 1.5% మాత్రమే అన్నారు. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ క‌ర్ణ‌న్, డీఎంహెచ్‌వో మాలతి, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed