కరోనా సోకిందని రిటైరైన గుమస్తా ఏం చేశాడంటే ..?

by  |
కరోనా సోకిందని రిటైరైన గుమస్తా ఏం చేశాడంటే ..?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా సోకినవారి భయంతోనే ప్రాణాలను వదిలేస్తున్నారు. ఈ మహామాంరికి చికిత్స కేవలం మనోధైర్యమే అనే విషయాన్ని మరిచి కరోనా సోకగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నార. తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్య కి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

కృష్ణాజిల్లా కంచికచర్ల స్కూల్లో గుమస్తాగా రిటైర్ అయిన నారాయణ అనే వ్యక్తికి రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతను శనివారం కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. కాగా ఈ ఉదయం అతనికి పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కరోనా సోకిందన్న భయంతో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో ఉన్న నారాయణను చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నారాయణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టార



Next Story